సోహర్‌ ఎయిర్‌పోర్ట్‌కి విమానాల రద్దు

- June 21, 2016 , by Maagulf
సోహర్‌ ఎయిర్‌పోర్ట్‌కి విమానాల రద్దు

సోహార్‌ ఎయిర్‌పోర్ట్‌కి ఒమన్‌ ఎయిర్‌ విమాన సర్వీసుల్ని రద్దు చేయడం నార్త్‌ మరియు సౌత్‌ బతినా నివాసితులకు షాక్‌ కలిగించింది. అయితే మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుండి సోహార్‌ ఎయిర్‌పోర్ట్‌కి విమానాలు నడపడం ఆర్థికంగా ఏమాత్రం ఉపయోగకరంగా లేదని ఒమన్‌ ఎయిర్‌ వర్గాలు తెలిపాయి. 5 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో విమాన సర్వీసుల్ని రద్దు చేశామని వెల్లడించింది ఒమన్‌ ఎయిర్‌. ఒమన్‌ షురా కౌన్సిల్‌ లీగల్‌ కమిటీ హెడ్‌ మొహమ్మద్‌ అల్‌ జద్జాలి ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ సమయంలో ఎనకమిక్‌ ఫీజబులిటీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. 63 మిలియన్‌ రియాల్స్‌ ఖర్చుతో ఈ ఎయిర్‌పోర్ట్‌ని నిర్మించారు. అలాగే 36 మిలియన్‌ రియాల్స్‌, మూడో ఫేజ్‌ నిర్మాణం కోసం వెచ్చించనున్నారు. ఈ పరిస్థితుల్లో విమానాల రద్దు మంచిది కాదని, ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అల్‌ జద్జాలి కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com