క్యాన్సర్ చిన్నారులతో సందడి చేసిన సాయిధరమ్‌ తేజ్‌

- June 21, 2016 , by Maagulf
క్యాన్సర్ చిన్నారులతో సందడి చేసిన సాయిధరమ్‌ తేజ్‌

ప్రాణాంతకరమైన వ్యాధితో పోరాటం చేస్తూనే... చెరగని చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారులే తనకు స్ఫూర్తి అని సినీహీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో యోగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిథరమ్‌తేజ్‌, కథానాయిక ఫరాకరీం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో ముచ్చటిస్తూ వారిలో ఆనందాన్ని నింపారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి... వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com