ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య ఇక లేరు
- June 21, 2016
ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మంగళవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతున్నారు. గూడ అంజయ్య ఇవాళ సాయంత్రం రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ మండలం రాగన్నగూడెంలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించారు.
నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా అంజయ్య ఎన్నో కథలు, పాటలు రాశారు.'నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు' అనే పాట ప్రజాదరణ పొందింది. ఆయన వ్రాసిన 'ఊరు మనదిరా' పాట 16 భాషలలో అనువాదం అయింది. తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసారు. అంజన్నకు ముగ్గురు కుమార్తెలు. గత నెల 25న ఆయన అనారోగ్యంతో నిమ్స్ లో చేరారు.
అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.
గూడ అంజయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై గేయాలు రాసిన అంజయ్య సేవలు చిరస్మరణీయమైనవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







