చట్టవిరుద్ధంగా తొలగింపు.. కార్మికుడికి BD8,000 పరిహారం..!!
- October 10, 2024
మనామా: రెండు సంవత్సరాల నుంచి వేతనాలు చెల్లించని యజమానిపై కార్మికుడు కేసు గెలిచాడు. చట్ట విరుద్ధంగా విధుల నుంచి తొలగించినందుకు జరిమానాల రూపంలో అతనికి BD8,000 చెల్లించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది. మూడేళ్ల సర్వీసు తర్వాత ఎలాంటి కారణం లేకుండా తొలగించారని కార్మికుడు కోర్టును ఆశ్రయించాడు. అతను BD500 నెలవారీ వేతనంతో ఓపెన్-ఎండ్ కాంట్రాక్టులో ఉన్నాడని, అక్టోబర్ 2021 నుండి మార్చి 2024 వరకు అతను వేతనం పొందలేదని కోర్టుకు తెలిపాడు. తక్కువ ఆదాయం, తక్కువ ఆర్డర్‌ల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది ఉందని యజమాని పేర్కొన్నారు. కాగా, తొలగింపుకు సరైన కారణాన్ని అందించడంలో కంపెనీ విఫలమైనందున, కార్మికుడిని తప్పుగా తొలగించారని కోర్టు గుర్తించి ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి