డ్రైవర్ పై 600,000 దిర్హామ్‌ల కోసం దావా వేసిన వాహనదారుడు..!!
- October 10, 2024
యూఏఈ: దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోకాలికి తీవ్రంగా గాయపడిన ఓ వాహనదారుడు.. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నుండి Dh600,000 పరిహారం ఇప్పించాలని కోర్టులో సివిల్ సూట్ వేశారు. ప్రమాదానికి కారణమైన ఆసియా ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్ తన స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి పేవ్‌మెంట్‌పైకి దూసుకెళ్లడంతో అతని వాహనం అదుపుతప్పి బర్ దుబాయ్ పరిసరాల్లో మోటార్‌సైకిల్ నడుపుతున్న మేనేజర్‌ను ఢీకొట్టింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షల్లో కుడి మోకాలికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, కొన్నాళ్లు ఉద్యోగానికి దూరంగా ఉండాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) ద్వారా రోగి కుడి మోకాలి పార్శ్వ కొలేటరల్ లిగమెంట్ కు గాయం అయిందని, అతడు క్రూసియేట్ లిగమెంట్ కార్టికల్ అవల్షన్ ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నివేదికలు అందజేశారు. ఆసియా డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని, తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని వాహనదారుడు కోర్టులో సివిల్ దావా వేశారు. అంతకుముందు దుబాయ్ ట్రాఫిక్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తి ముందు నేరాన్ని అంగీకరించడంతో అతనికి 4,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







