ఇక పట్టాలెక్కడమే..హఫీత్ రైల్ కు OMR577 మిలియన్ ఫైనాన్సింగ్..!!
- October 10, 2024
అబుదాబి: సోహార్ పోర్ట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో అనుసంధానించే హఫీత్ రైల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ బ్యాంక్ ఫైనాన్సింగ్‌పై హఫీత్ రైల్ సంతకం చేసింది. మొత్తం OMR577 మిలియన్ల ప్రాజెక్ట్ కు ఒమానీ, ఎమిరాటీ బ్యాంకులతోపాటు పలు అంతర్జాతీయ బ్యాంకులు ఫైనాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఫాలెన్ హీరోస్ అఫైర్స్ డిప్యూటీ చైర్మన్, ఎతిహాద్ రైల్ చైర్మన్ షేక్ థెయాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్లోబల్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిబిషన్ & కాన్ఫరెన్స్ - గ్లోబల్ రైల్ 2024 ప్రారంభోత్సవం సందర్భంగా ఒప్పందాలు జరిగాయి. OMR961 మిలియన్ జాయింట్ ప్రాజెక్ట్ ను హఫీత్ రైల్ నిర్వహిస్తుంది. 238 కి.మీ పొడవైన రైల్వే నెట్వర్క్ లో 60 వరకు వంతెనలు, సొరంగాలు ఉన్నాయి. రెండు దేశాలలో ఐదు ప్రధాన ఓడరేవులు, వివిధ పారిశ్రామిక, ఫ్రీ జోన్లను రైల్వే కలుపుతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి