ఇల్లీగల్ మెడికల్ ప్రాక్టీస్.. సౌదీ మహిళతోసహా అరబ్ జాతీయుడు అరెస్ట్..!!
- October 10, 2024
రియాద్: హెయిల్ ప్రాంతంలో లైసెన్స్ లేకుండా వైద్య వృత్తిని అభ్యసిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిలో ఒక సౌదీ మహిళ, ఒక అరబ్ జాతీయుడు ఉన్నారని తెలిపారు. వారు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు ప్రచారం నిర్వహించినట్టు గుర్తించారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. లైసెన్స్ లేకుండా మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనల ఆరోగ్య ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటి ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రోగుల భద్రతతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయి, ఎలక్ట్రానిక్ తనిఖీలను నిర్వహిస్తోందన్నారు.
తాజా వార్తలు
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..
- రాస్ అల్ ఖైమాలో ప్రత్యేక వర్గాల కోసం ట్యాక్సీల సంఖ్య రెట్టింపు
- షూటింగ్లో ఆరో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ







