బెట్టింగ్ లో పోయిన సొమ్ము పై కేసు వేయడం సాధ్యపడుతుందా..?
- October 11, 2024
భారతదేశంలో బెట్టింగ్ అనేది చట్టవిరుద్ధం అయినప్పటికీ, ఇది ఇంకా అనధికారికంగా కొనసాగుతోంది. ప్రస్తుతం క్రికెట్ వంటి క్రీడలు ప్రధానంగా బెట్టింగ్‌కు కేంద్రంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ నిర్వహణలో మొబైల్ యాప్స్, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇందులో బుకీలు తమ నెట్వర్క్ ద్వారా పందాలు స్వీకరిస్తారు.. పోలీసులు తరచుగా దాడులు చేస్తారు.. ఇలా బెట్టింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాపారం అధిక లాభాలను అందిస్తుంది, కానీ బెట్టింగ్ అనేది చట్టబద్ధం కాదు బెట్టింగుకు పాల్పడడం అనేది చట్టవిరుద్దం.
ఇక భారతదేశంలో బెట్టింగ్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. బెట్టింగ్ అనేది భారతదేశంలో చట్టబద్ధం కాదు. 1867లో ప్రవేశపెట్టిన పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం, బెట్టింగ్ మరియు జూదం రెండు కూడా చట్టవిరుద్ధం. ఈ చట్టం ప్రకారం, బెట్టింగ్ కు పాల్పడడం లేదా జూదం ఆడడం మరియు నిర్వహించడం నిషేధించబడ్డాయి. ఇంకా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బెట్టింగుకు పాల్పడితే వారికి శిక్షలు విధించబడతాయి. అందుకే బెట్టింగ్ అనేది చట్ట విరుద్ధమైనప్పుడు బెట్టింగ్ కి పాల్పడి బెట్టింగ్‌లో పోయిన సొమ్ము పై కేసు వేయడం సాధ్యపడదు, ఎందుకంటే చట్టం ప్రకారం బెట్టింగ్‌లో పాల్గొనడం నేరం కాబట్టి.
అయితే భారతదేశంలో బెట్టింగ్ చట్టాలు 1867 నాటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆధారంగా.. ఈ చట్టం ప్రకారం, బెట్టింగ్ లేదా జూదం నిర్వహించడం, లేదా వాటిలో పాల్గొనడం నేరం అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు తమ స్వంత చట్టాలను రూపొందించుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా గోవా మరియు సిక్కిం లాంటి రాష్ట్రాలు జూదం మరియు బెట్టింగ్‌ను చట్టబద్ధం చేశాయి. ఈ రాష్ట్రాల్లో కొన్ని కాసినోలు మరియు బెట్టింగ్ సెంటర్లు ఉన్నాయి, కానీ అవి కేవలం ఆ రాష్ట్రాల పరిధిలోనే చట్టబద్ధం.
ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ కూడా భారతదేశంలో చట్టబద్ధం కాదు. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు భారతదేశంలో నిషేధించబడ్డాయి. మరియు వాటిని ఉపయోగించడం కూడా నేరం. మొత్తానికి, భారతదేశంలో బెట్టింగ్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, మరియు బెట్టింగ్‌లో పాల్గొనడం నేరం. బెట్టింగ్‌లో పోయిన సొమ్ము పై కేసు వేయడం సాధ్యపడదు, ఎందుకంటే చట్టం ప్రకారం అది నేరం.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







