బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడుతున్నారా?
- October 11, 2024
ప్రస్తుత జనరేషన్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్ వాడే చాలా మంది ఎక్కువగా ఇయర్ బడ్స్ వాడుతుంటారు.ఈ ఇయర్ బర్డ్స్ ను ఎక్కువగా యువతరం ఉపయోగిస్తుంటారు.ఒకప్పుడు కేవలం సాంగ్స్ వినడానికే వీటిని వాడగా.. ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరిగాక వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది.ఇయర్ బడ్స్ వాడటం సౌకర్యంగా ఉండడంతో వీటిని వాడే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.దీంతో రోజులో ఎక్కువ భాగం చెవిలో పెట్టుకొని పాటలు వింటూ గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ గడిపేస్తున్నారు.అయితే ఈ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ను రోజులో ఎక్కువసేపు వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే మీ చెవులు శాశ్వతంగా వినికిడిని కోల్పోవచ్చు.
బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడటం సౌకర్యంగా ఉంటుంది, కానీ వినికిడి రక్షణ మరియు ఇన్ఫెక్షన్లను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
మొదటగా, ఇయర్ బడ్స్ ను ఎక్కువసేపు వాడటం వల్ల చెవులు దురద, ఇన్ఫెక్షన్లు, లేదా వినికిడి సమస్యలు రావచ్చు. అందువల్ల, ప్రతి గంటకు ఒకసారి విరామం తీసుకోవడం మంచిది. ఇది కచ్చితంగా పాటించాలి. గ్యాప్ తీసుకోకపోతే మీ చెవులు శాశ్వతంగా వినికిడిని కోల్పోవచ్చు.
ఇంకా, ఇయర్ బడ్స్ ను వాడే ముందు మరియు వాడిన తర్వాత శుభ్రం చేయడం చాలా ముఖ్యం. చెవులలో మురికి చేరకుండా ఉండేందుకు ఇయర్ బడ్స్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. చెవులలో మురికి చేరకుండా ఉండేందుకు ఇసోప్రోపిల్ ఆల్కహాల్ మరియు కాటన్ స్వాబ్ తో శుభ్రం చేయాలి. ఇయర్ బడ్స్ సరిగ్గా సరిపడే విధంగా ఉండాలి.అవి సరిగ్గా సరిపోకపోతే, అసౌకర్యం కలగవచ్చు మరియు శబ్దాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది.
మరియు, ఇయర్ బడ్స్ ను ఎక్కువ శబ్దంతో వాడటం వల్ల వినికిడి నష్టం కలగవచ్చు. అందువల్ల, శబ్ద స్థాయిని మితంగా ఉంచుకోవడం మంచిది.ఎక్కువ శబ్దంతో వింటే చెవులు నొప్పిగా కూడా అనిపిస్తాయి అందువల్ల, శబ్దాన్ని 85 డెసిబెల్స్ కంటే తక్కువగా ఉంచుకోవడం మంచిది. ఇయర్ బడ్స్ లో నాయిస్-క్యాన్సెలింగ్ ఫీచర్లు ఉంటే, వాటిని ఉపయోగించడం ద్వారా శబ్దాన్ని తగ్గించుకోవచ్చు.
ఇయర్ బర్డ్స్ వాడటం కంటే హెడ్ ఫోన్లు వాడటం చాలా మంచిది.ఇయర్ బర్డ్స్ హెడ్ ఫోన్స్ కి తేడా ఏమిటంటే ఇయర్ బర్డ్స్ ని చెవి లోపల పెట్టుకుంటే హెడ్ ఫోన్స్ ని చెవి మీద పెట్టుకుంటాం.హెడ్ ఫోన్లు చెవి మీద పెట్టుకుంటే.. శబ్దానికి, కర్ణభేరి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. తద్వారా చెవికి అంతగా ప్రమాదం ఉండదు. ఒకవేళ మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడడం కంటే హెడ్ ఫోన్లు వాడటం మంచిది. అది కూడా పరిమితంగానే.
చివరగా, ఇయర్ బడ్స్ ను ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల వాటిని ఇతరులకు ఇవ్వకుండా ఉండడం మంచిది.ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా బ్లూటూత్ ఇయర్ బడ్స్ ను సురక్షితంగా మరియు సౌకర్యంగా వాడుకోవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









