'అందరికీ ఆరోగ్య బీమా'..షార్జా రూలర్ హామీ..!!
- October 11, 2024
యూఏఈ: షార్జాలోని ఎమిరాటీలందరికీ ఉచిత ఆరోగ్య బీమా లభించే రోజు వస్తుందని షార్జా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి డైరెక్ట్ లైన్ రేడియో కార్యక్రమం ద్వారా నివాసితులకు హామీ ఇచ్చారు. షార్జా ప్రభుత్వం తన ఉద్యోగులు వారిపై ఆధారపడిన వారికి, అలాగే సీనియర్ ఎమిరేట్స్‌కు ఆరోగ్య బీమాను అందిస్తోంది. కానీ ఈ కవరేజీని విస్తరించింది. 'వృద్ధుల కోసం బీమా' పథకం కోసం వయోపరిమితిని తగ్గించినట్టు షార్జా హెల్త్ అథారిటీ (SHA) ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు 45 ఏళ్ల వయస్సు వారికి బీమా అందించబడుతుందని, అయితే, అర్హత పొందాలంటే, వారు యూఏఈ పౌరులు, ఎమిరేట్ నివాసి అయి ఉండాలని SHA వైద్య బీమా విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఫలాహ్ తెలిపారు. గతంలో, ప్రభుత్వ ప్రాయోజిత బీమాకు అర్హత పొందాలంటే సీనియర్ ఎమిరాటీకి కనీసం 50 ఏళ్లు ఉండాలి. ఈ పథకంతో పాటు, ఉద్యోగులందరికీ తప్పనిసరి ఆరోగ్య బీమాను జనవరి 2025లో అమలు చేయడానికి షార్జా సిద్ధమవుతోంది. దుబాయ్, అబుదాబిలోని ఉద్యోగులందరూ ఇప్పటికే స్థానిక నిబంధనల ఆధారంగా మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీకి అర్హులు. కాగా.. షార్జా, నార్తర్న్ ఎమిరేట్స్‌లో ఇది తొలిసారి అని పేర్కొన్నారు. ప్రాథమిక హెల్త్ ప్యాకేజీని అభివృద్ధి చేయడానికి స్థానిక ప్రభుత్వ అధికారులు.. అబుదాబి, దుబాయ్‌లలో విధానాలను సమీక్షిస్తున్నారని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి