మంత్రి లోకేష్ అక్టోబర్ 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికా పర్యటన

- October 11, 2024 , by Maagulf
మంత్రి లోకేష్ అక్టోబర్ 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగే ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరుకానున్నారు.ఈ సదస్సులో, లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఎందుకంటే లోకేష్ గారు రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ టెక్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.ఇటీవల, ఆయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10,000 ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇంకా లోకేష్ ఈ పర్యటనలో మరిన్ని ప్రఖ్యాత ఐటీ కంపెనీలను రాష్ట్రంలోకి రప్పించి, లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయనున్నారు.ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రాబట్టడం, మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ పర్యటనలో భాగంగా, లోకేష్ అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను వివరించనున్నారు.ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి, మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com