సినిమా రివ్యూ: ‘వెట్టియాన్’
- October 11, 2024
రజనీకాంత్ సినిమాలంటే ఎప్పుడూ అంచనాలు భారీగానే వుంటాయ్. కానీ, ఈ మధ్య ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనాలు సృష్టించలేకపోతున్నాయ్. గత సినిమా ‘జైలర్’ జస్ట్ ఓకే. తాజా సినిమా ‘వెట్టియాన్’పై అంతగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ, ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ పాజిల్ వంటి నటులు నటించడంతో సినిమాపై ఒకింత అంచనాలు పెరిగాయ్. క్రిటిక్స్‌తో ప్రశంసలు అందుకున్న సందేశాత్మక చిత్రం ‘జై భీమ్’ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడం మరో విశేషం. మరి, అంచనాల్ని ఈ సినిమా అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
ఎన్‌కౌంటర్ స్పెషలిష్ట్ అయిన అథియన్ (రజనీకాంత్) నీతికీ, న్యాయానికీ కేరాఫ్ అడ్రస్. అన్యాయం జరిగితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికైనా వెనుకాడడు. అలా ఆయన చేతికి ఓ టీచర్ హత్య కేసు వస్తుంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా పట్టుకోలేని ఈ హత్య కేసులో నిందితుడ్ని కొన్ని గంటల వ్యవధిలోనే అథియన్ పట్టుకుని మట్టు పెడతాడు. అయితే, ఆ తర్వాత తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయ్. మానవ హక్కుల కోసం పోరాటం చేసే సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఎందుకు అథియన్‌కి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది.? ఈ కారణంగా అథియన్ కేసును ఎందుకు తిరిగా పరిశోధించాల్సి వచ్చింది.? ప్యాట్రిక్ అలియాస్ బ్యాటరీ (ఫహాద్ పాజిల్) నిందితుడ్ని ఎందుకు తప్పించాడు.? కార్పొరేట్ పర్సన్ అయిన నటరాజ్ (రానా)కీ, బ్యాటరీకీ, అథియాన్‌కీ సంబంధం ఏంటీ.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘వెట్టియన్’ ధియేటర్లలో చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
సూపర్ స్టార్ రజనీకాంత్‌ని గతంలో చాలా పోలీస్ పాత్రల్లో చూశాం. ఈ సినిమాకి ముందే ‘జైలర్’ పాత్రలో చూశాం. సో ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్రలో కొత్తదనమేమీ కనిపించదు. లుక్స్‌లోనూ మ్యానరిజంలోనూ ఎటువంటి కొత్తదనం లేదు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’ అనే డైలాగ్ ఈ సినిమాలో రజనీకాంత్ నుంచి విన వచ్చే కొత్త డైలాగ్. ఆయన వరకూ ఆయన పాత్రకు తగిన న్యాయం చేశారంతే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ నటుడ్ని ఎంచుకున్నప్పుడు ఆయన పాత్రను బలంగా తీర్చి దిద్దాల్సింది. సూపర్ స్టార్, బిగ్‌బీ మధ్య వాగ్వాదం, సన్నివేశాలు బలంగా వుంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్ కానీ, అలాంటి మ్యాజిక్ ఏమీ జరగదు. మరో కీలక పాత్ర ఫహాద్ పాజిల్.. ఈ పాత్రపై డైరెక్టర్ పెట్టిన ఫోకస్ మిగిలిన పాత్రల పైనా పెట్టి వుంటే బాగుంటుంది. సినిమాకి ఈ పాత్రే స్పెషల్ అట్రాక్షన్. సీరియస్‌గా కనిపిస్తూనే ఫన్ క్రియేట్ చేస్తుంటాడు ఫహాద్. అలాగే రానా కార్పొరేట్ పర్సన్ క్యారెక్టర్ ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. హీరోయిన్ మంజు వారియర్ పాత్ర కూడా సినిమాకి కీలకమే. ఆమె తన పాత్ర పరిధి మేర నటించి మెప్పించింది. ఒక పాటలో ఆమె వేసిన డాన్స్ స్టెప్పులు కూడా హుషారెత్తిస్తాయ్. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేర నటించి మెప్పిస్తారు.
సాంకేతిక వర్గం పనితీరు:
‘జై భీమ్’ తరహాలోనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా కూడా ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు జ్హాన్‌వేల్. కానీ, ఈ సినిమాకి అది వర్కవుట్ కాలేదు. ఓ క్రైమ్ స్టోరీ ఇన్వెస్టిగేషన్‌లా కథ స్టార్ట్ అయ్యి మలుపులు తిరుగుతుంటుంది. ఏ మలుపులోనూ పెద్దగా ఆసక్తి కనిపించదు. చాలా సాదా సీదాగా సన్నివేశాలు సాగిపోతుంటాయ్. డైలాగులు బలంగానే వున్నాయ్. కథలోనూ బలం వుంది. కానీ, కథనం నడిపించిన తీరు ఏమాత్రం ఆసక్తి కలిగించేలా వుండదు. పాత్రల్లో సహజత్వం లేకపోవడం ఈ సినిమాకి మైనస్. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజీక్ కూడా ఏం మ్యాజిక్ చేసినట్లు అనిపించదు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎడిటింగ్‌లో చాలా పనే వుందనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో వచ్చే తొలి సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్, ఫహాద్ పాజిల్ క్యారెక్టర్ డిజైన్, ఆయన పర్‌ఫామెన్స్..
మైనస్ పాయింట్స్:
వీక్ స్క్రీన్ ప్లే, బలమైన ఆర్టిస్టుల్ని బలహీనంగా చూపించిన వైనం. కమర్షియల్ అంశాలకు ఎక్కడా అవకాశం లేకపోవడం..
చివరిగా:
సూపర్ స్టార్ రజనీకాంత్.. ‘గురి పెట్టాడు కానీ, ఈ సారి కూడా ఎర పడలేదుగా’.!
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్‌లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్‌పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా