తిరుచిరాపల్లి నుంచి షార్జా విమానానికి తప్పిన పెను ప్రమాదం..
- October 11, 2024
తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఆ విమానంలోని 141 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎయిరిండియా బోయింగ్ విమానం తిరుచ్చి ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎయిరిండియా విమానంలో హైడ్రాలిక్ సిస్టమ్ దెబ్బతినడంతో దాదాపు 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి ల్యాండింగ్ గేర్ ఓపెన్ కావడంతో పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి సేఫ్ ల్యాండింగ్ చేశారు.కాగా, అంతకు ముందు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రమాదం జరగొచ్చని అంతా భయపడ్డారు. విమానంలో 141 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.
మరోవైపు ప్రమాదం జరగొచ్చనే భయంతో..ముందుగానే ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా అంబులెన్సులు, ఫైరింజన్లు రెడీ చేశారు. అయితే, ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్.. తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్తోంది. ఇంతలో హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య తలెత్తింది. దీంతో దాదాపు మూడు గంటల పాటు విమానం గాల్లోనే ఉండిపోయింది.దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి పైలెట్లు విమానాన్ని రాత్రి 8 గంటల 14 నిమిషాలకు సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. పైలెట్ నిరంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదింపులు జరిపారు. బెల్లీ ల్యాండింగ్ చేయాలని అధికారులు సూచించారు.చివరికి నార్మల్ ల్యాండింగ్ చేశారు.ఈ ఘటనను సివిల్ ఏవియేషన్ సీరియస్ గా తీసుకుంది.దీని పై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలేం జరిగింది? ఎందుకీ సమస్య తలెత్తింది? అనే వివరాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ 613 విమానం తిరుచిరాపల్లి నుండి షార్జాకు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కొంతసేపటికే హైడ్రాలిక్ సమస్య తలెత్తింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి