హిట్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్
- October 13, 2024
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు గురి కావడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది.కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా అనుమానిస్తోన్నారు.ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు కూడా ఈ కేసు దర్యాప్తులో భాగస్వామ్యం కావడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. వారికి సుపారీ ఎవరిచ్చారు? ఆయుధాలు ఎక్కడి నుంచి అందాయి? వాటిని ఎవరు పంపించారు? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు.
బాబా సిద్ధిక్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు.ఎప్పటి నుంచో ఈ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ముంబై బాంద్రా వెస్ట్ బంద్ స్టాండ్ ప్రొమోనెడ్, బైరామ్జీ జీజీభాయ్ రోడ్లో ఉంటుంది సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నివసిస్తోన్న గెలాక్సీ బంగ్లా. ఈ తెల్లవారు జాము నుంచి ఈ బంగ్లా ముందు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పికెటింగ్ నెలకొల్పారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేస్తోన్నారు.
గతంలో సల్మాన్ ఖాన్‌కు పలుమార్లు బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పైనా కాల్పులు జరిపిన ఉందంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ ఆయనకు బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తోన్నాయి.
సల్మాన్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు గ్యాంగ్స్టర్లు.ఆయనను హత మార్చడమే తన లక్ష్యమంటూ ఇదివరకే లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించుకున్నాడు కూడా.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరు వ్యక్తులు నేరుగా సల్మాన్ ఖాన్ ఇంటిపైనా కాల్పులు జరిపారు.మొత్తం మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది.ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి