జామ్ నగర్ మహారాజుగా క్రికెటర్ అజయ్ జడేజ

- October 13, 2024 , by Maagulf
జామ్ నగర్ మహారాజుగా క్రికెటర్ అజయ్ జడేజ

జామ్‌నగర్ రాజకుటుంబానికి చెందిన అజయ్ జడేజా, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఇప్పుడు జామ్‌నగర్ రాజకుటుంబ సింహాసనానికి వారసుడిగా ప్రకటించబడ్డారు. ఈ ప్రకటనను ప్రస్తుత జాం సాహెబ్ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌ సింహ్‌జీ జడేజా అధికారికంగా విడుదల చేశారు. ఈ నిర్ణయం విజయదశమి పర్వదినం సందర్భంగా తీసుకున్నారు, ఇది పాండవులు అజ్ఞాతవాసం ముగించుకున్న రోజు అని భావిస్తారు.

జామ్‌నగర్ రాజకుటుంబానికి వారసుడిగా అజయ్ జడేజా ఎంపిక కావడం, జామ్‌నగర్ ప్రజలు గొప్ప వరంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం జామ్‌నగర్ ప్రజలకు ఆనందాన్ని కలిగించింది. ఇది జామ్‌నగర్ రాజకుటుంబానికి ఒక కొత్త అధ్యాయం. అజయ్ జడేజా తన క్రికెట్ కెరీర్‌లో సాధించిన విజయాలను, ఇప్పుడు తన రాజకుటుంబ వారసత్వంలో కొనసాగిస్తారని ఆశిస్తున్నారు.


అజయ్ జడేజా క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. 1992 నుండి 2000 వరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1996లో బెంగుళూరులో జరిగిన ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆ మ్యాచ్‌లో అజయ్ జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించారు.

జడేజా తన ఆటతీరుతో డేరింగ్‌ అండ్ డాషింగ్ అనే పేరు తెచ్చుకున్నారు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం, సింగిల్‌ వచ్చేచోట రెండో పరుగు తీయడం లాంటివి చేసేవారు. ఫీల్డింగ్‌లోనూ ఆయన మెరుపులు మెరిపించారు. గాల్లోకి అమాంతం ఎగరడం, ఒంటి చేతి క్యాచ్‌లు, సింగిల్‌ స్టంప్‌ వ్యూ రనౌట్‌లు లాంటివి ఎన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com