సిటీస్కేప్ ఖతార్ 2024.. DECCలో ప్రారంభం..!!
- October 13, 2024
దోహా: సిటీస్కేప్ ఖతార్ 2024..దోహా ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ (DECC)లో ప్రారంభమవుతుంది. ఈవెంట్లో 60 మంది డెవలపర్లు, 10,000 మందికి పైగా డెలిగేట్స్ హాజరవుతున్నారు. 110 కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి హెచ్ఇ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో జరిగిన సిటీస్కేప్ 12వ ఎడిషన్ ఖతార్ అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రారంభోత్సవం జరుగనుంది. సిటీస్కేప్ ఖతార్ వెబ్సైట్ ద్వారా సందర్శకులు ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. "ఇంటి కొనుగోలుదారులు, వినియోగదారుల కోసం మేము సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ల నుండి విల్లాల వరకు వేలకొద్దీ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రదర్శిస్తాము. అలాగే ఆఫ్-ప్లాన్ రియల్ ఎస్టేట్ లాంచ్‌లు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను ప్రదర్శిస్తాము." అని సిటీస్కేప్ ఎగ్జిబిషన్ డైరెక్టర్ అలెగ్జాండర్ హ్యూఫ్ చెప్పారు.
ఈవెంట్ అక్టోబర్ 13న 10:15am–8pm; అక్టోబర్ 14న 12pm-8pm; అక్టోబర్ 15న 12pm-10pm వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..







