విజిట్ వీసాలో ఉన్నప్పుడు పని చేయడం చట్టబద్ధమైనదేనా?
- October 13, 2024
యూఏఈ: యూఏఈలో ఉద్యోగ సంబంధాల నియంత్రణపై 2021లోని ఫెడరల్ డిక్రీ లా నంబర్ 33లోని ఆర్టికల్ 6(1) ప్రకారం.. చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ లేకుండా ఒక వ్యక్తిని యజమాని రిక్రూట్ చేయకూడదు. ఇంకా, చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్.. చెల్లుబాటు అయ్యే యూఏఈ రెసిడెన్సీ వీసా లేకుండా ఒక ప్రవాసుడు యూఏఈలో ఎలాంటి ఉద్యోగంలో చేరకూడదు. ఇది విదేశీయుల ప్రవేశం మరియు నివాసానికి సంబంధించి 2021లోని ఫెడరల్ డిక్రీ నెం. 29లోని ఆర్టికల్ 5(4)లో స్పష్టం చేశారు. మానవ వనరులు & ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నిర్దేశించిన విధంగా వర్క్ పర్మిట్‌ని పొందిన వారికే కంపెనీలు అవకాశం కల్పిస్తాయి. వర్క్ పర్మిట్ల రకాలు 2022 క్యాబినెట్ రిజల్యూషన్ నెం. 1లోని ఆర్టికల్ 6లో పేర్కొన్న విధంగా ఫుల్ టైమ్, పార్ట్-టైమ్ వర్క్ పర్మిట్లు, తాత్కాలిక పని అనుమతి, ఫ్రీలాన్స్ వర్క్ పర్మిట్లలో ఒకదానిని కలిగి ఉండాలి. ఒక యజమాని చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్, రెసిడెన్సీ వీసా లేకుండా ఒక వ్యక్తిని రిక్రూట్ చేసినట్టయితే.. పెనాల్టీ కింద Dh100,000 వరకు విధించే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా, మీ కొత్త యజమాని దాని ద్వారా స్పాన్సర్ చేయబడిన వర్క్ పర్మిట్, యూఏఈ రెసిడెన్సీ వీసాను పొందవలసిందిగా అభ్యర్థించవచ్చని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు,మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా వివరించారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







