జియో బుక్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్
- October 13, 2024
తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ కోసమే. అయితే జియో బుక్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ కలదు. ఇది ముఖ్యంగా విద్యార్థులు మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు లేదా ఇతర ప్రాథమిక కంప్యూటింగ్ అవసరాలు ఉన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన బడ్జెట్ లాప్టాప్. ఈ జియో బుక్ ను రిలయన్స్ జియో కంపెనీ విడుదల చేసిన ఒక బడ్జెట్ ల్యాప్‌టాప్. ఇది ఎలా పనిచేస్తుంది దీని కన్ఫిగరేషన్ గురించి తెలుసుకుందాం.
జియో బుక్ ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఓఎస్ (Jio OS) పై పనిచేస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ మరియు అడ్రెనో 610 జీపీయూ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ 11.6 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది వీడియోలు చూడటానికి మరియు ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ చేయడానికి అనువుగా ఉంటుంది. జియో బుక్‌లో 2జీబీ ర్యామ్ మరియు 32జీబీ eMMC స్టోరేజ్ ఉంది, ఇది సాధారణ పనులకు సరిపోతుంది. అయితే, మీరు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 128జీబీ వరకు పెంచుకోవచ్చు.
జియో బుక్‌లో 5000mAh బ్యాటరీ ఉంది, ఇది ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు 8 గంటల వరకు పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో వైఫై మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, హెచ్‌డీఎంఐ మినీ పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు, జియో బుక్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను సగం ధరకు కొనుగోలు చేయవచ్చు.
జియో బుక్ ప్రస్తుత ఎమ్మార్పీ (MRP) రూ. 35,605 కాగా, డిస్కౌంట్ ప్రైస్ రూ. 15,799/- మీరు ఈ ఆఫర్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
మొత్తం మీద, జియో బుక్ ఒక సరసమైన, ప్రాథమిక అవసరాలను తీర్చగలిగే ల్యాప్‌టాప్. ఇది ముఖ్యంగా విద్యార్థులు మరియు ప్రాథమిక కంప్యూటింగ్ అవసరాలు ఉన్న వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







