కలిసి నటించనున్న సూర్య, జ్యోతిక...
- June 21, 2016
తమిళ స్టార్ హీరో సూర్య, జ్యోతికని వివాహం చేసుకున్న తర్వాత వీరికి దియా అనే పాప జన్మించిన సంగతి తెలిసిందే. సూర్యను వివాహమాడిన తర్వాత జ్యోతిక పూర్తిగా వెండి తెరకు దూరమైంది. ఇటీవల 36 వయోదినిలే అనే లేడి ఓరియెంటెడ్తో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, తాజాగా సూర్యతో కలిసి నటించేందుకు సిద్దమైంది.జ్యోతిక రీ ఎంట్రీ మూవీ 36 వయోదినిలే మూవీని సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించగా, ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో తన తరువాతి సినిమాని కూడా ప్లాన్ చేసింది ఈ అమ్మడు. అయితే ఈ మూవీని కూడా సూర్యనే నిర్మిస్తున్నారు. తొలి చిత్రం కుట్రం కడిదల్తోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బ్రహ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఇందులో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. 2006లో వచ్చిన ఒరు కాదల్ అనే తమిళ చిత్రంలో చివరి సారిగా కలిసి నటించిన వీరిరివురు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి నటించనుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







