మళ్ళీ రాజకీయాల్లోకి మోహన్ బాబు
- June 21, 2016
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మోహన్ బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి తెలిపారు. 1982 లో రాజకీయ ఆరంగేట్రం చేసిన మోహన్ బాబు టిడిపి పార్టీలో కొన్నాళ్ళు పనిచేశారు. రాజసభ్యుడిగా కూడా తన సేవలను అందించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం విశేషం.నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్ధలు ఛైర్మన్‌గా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్న మోహన్ బాబు త్వరలో ఓ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్టు తెలిపారు. అయితే ఏ పార్టీ అనేది త్వరలోనే ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.
తాను ఆవేశపరుడినే కాని, అవినీతిపరుడిని కాదన్న మోహన్‌బాబు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయలకు చలించి రాజకీయాల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఏపి వారిని కేసిఆర్ ప్రోత్సహించడం అభినందనీయం అని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







