ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం

- October 14, 2024 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం

అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తుండగా.. మరికొన్నింటిని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ప్రకటించింది. గతంలో ఈ రుణాల పరిమితి రూ.2 లక్షలుగా ఉండేది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా రూ.50వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందించనుంది. 2024-25 ఏడాదికి సంబంధించి రూ.250 కోట్లను రుణంగా ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద, డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు ఈ రుణాలు అందించనున్నారు. ఈ రుణాలు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణకు ఉపయోగపడతాయి.

ఈ రుణంపై వడ్డీ ఉండదు, అంటే మహిళలు తీసుకున్న రుణాన్ని వడ్డీ లేకుండా తిరిగి చెల్లించవచ్చు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో రాయితీ రూ.180 కోట్లు, మిగతా రూ.320 కోట్లు వడ్డీలేని రుణంగా అందిస్తారు. నవంబరు నుంచి లబ్ధిదారుల ఎంపిక మొదలవుతుంది. 

ఈ రుణాలు ప్రధానంగా వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ రంగం, సేవారంగాల్లో ఉన్నవారికి అందిస్తారు. రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించే లబ్ధిదారులు ఈ పథకం ద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా మహిళలు తమ స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకోవచ్చు లేదా విస్తరించుకోవచ్చు. ఈ రుణ పరిమితిని రూ.5లక్షల వరకు పెంచడం డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com