Dh400 ఫైన్.. జైవాకింగ్ చేసిన 37 మందికి జరిమానా..!!
- October 14, 2024
దుబాయ్: నైఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైవాకింగ్ చేసిన 37 మందికి జరిమానాలు విధించారు. ప్రమాదకరంగా క్రాస్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్‌లను విస్మరించడం, ఇతరులకు ప్రమాదం కలిగించినందుకు జరిమానాలు విధించినట్టు అధికారులు తెలిపారు.ఫెడరల్ ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 89 ప్రకారం.. పాదచారుల ట్రాఫిక్ సిగ్నల్‌లను ఉల్లంఘించడం లేదా అనధికార ప్రాంతాలలో క్రాసింగ్ చేస్తే Dh400 జరిమానా విధించబడుతుంది. ఇదిలా ఉండగా జైవాకింగ్ ఎలా ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందో దుబాయ్ పోలీసులు చాలాసార్లు హైలైట్ చేశారు. నిర్దేశించని ప్రదేశాల నుండి ప్రజలు రోడ్లు దాటుతుండగా గతేడాది జరిగిన రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా, 339 మంది గాయపడ్డారు. 2023లో జైవాకింగ్ చేసినందుకు దాదాపు 44,000 మంది పాదచారులకు జరిమానా విధించారు. నైఫ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ ఒమర్ మౌసా అషౌర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం గురించి పాదచారులను గట్టిగా హెచ్చరించారు. క్రాసింగ్ గైడ్‌లైన్స్‌ను పాటించాలని, రోడ్డు దాటడానికి ముందు ట్రాఫిక్ ను గమనించాలని సూచించారు. పాదచారులు క్రాసింగ్ మార్గదర్శకాలను పాటించాలని, రోడ్డుపై వాహనాలు లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు. పాదచారుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు పిలుపునిచ్చారు. నిర్ణీత క్రాసింగ్‌ల వద్ద పాదచారుల క్రాసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వడంలో వాహన డ్రైవర్లు విఫలమైతే Dh500 జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లతో శిక్షార్హమైనదని హెచ్చరించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







