'గల్ఫ్ చేసిన మేలు' పాట విడుదల చేసిన సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్

- October 14, 2024 , by Maagulf
\'గల్ఫ్ చేసిన మేలు\' పాట విడుదల చేసిన సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్

దుబాయ్: తెలంగాణ యువకులకు గల్ఫ్ దేశాలు ఎంత గానో ఆదుకున్నాయి అని , అక్కడి ప్రజల గొప్పతనం మరియు వారు మన కార్మికులకు ఇచ్చిన ఉపాధి గురించి చెపుతూ దుబాయ్ లో ఉండే జగిత్యాల జిల్లాకు చెందిన సింగర్ & రైటర్ మల్లేష్ కోరేపు రాసిన 'గల్ఫ్ చేసిన మేలు' ఆల్బమ్ పాటను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ మ్యూజిక్ జత చేసి పాడారు, పాట ఆడియో స్వయంగా దుబాయ్ వెళ్లి స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాల వేదికగా CD పోస్టర్ ని రిలీజ్ చేశారు. నా పాట వందే మాతరం సార్ పాడటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని పాట ఖర్చులకు ఆర్థిక సహాయం చేసిన దుబాయ్ ప్రముఖులు తోట రాం కుమార్, సత్యం రాధారపు , మోతె రాములు, మనోజ్ పటేల్, సుతారి సత్యం, కొట్టాల సత్యనారాయణ గౌడ్ మరియు స్పార్క్ మీడియా అరుణ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంత గొప్ప పాటను వీడియో కూడా చేయించాలని అందుకు కూడా మీరే ముందుండి మల్లేష్ కు సహకరించాలని వందే మాతరం శ్రీనివాస్ వారిని ప్రత్యేకంగా కోరారు.

ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఫెమ్ డాన్సర్ నాగ దుర్గ, రేడియో ఖుషి 92.2 FM టీమ్, మా గల్ఫ్  శ్రీకాంత్, T Homes రియల్ ఎస్టేట్ వైకుంఠ రావు, లావణ్య, జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com