ఢిల్లీలో జనవరి 1 వరకు టపాసులపై నిషేధం
- October 14, 2024
న్యూ ఢిల్లీ: వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 1 వరకు అన్ని రకాల టపాసులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని అన్ని రకాల బాణసంచా వాడకం, తయారీ, నిల్వ, విక్రయాలను జరపకూడదని చెప్పింది.
ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫాంలలోనూ టపాసులను అమ్మడానికి వీలులేదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటీసును ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్‌లో షేర్ చేశారు. చలికాంలో ఢిల్లీలో వాయుకాలుష్య సమస్య మరింత తీవ్రతరమవుతుందని, బాణసంచా కూడా అందుకు కారణమవుతుందని చెప్పారు.
చలికాలంలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసులపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ప్రజలందరు సహకారం అందించాలని కోరింది. మరోవైపు, ఢిల్లీలో గాలి నాణ్యత సోమవారం ప్రమాదకర కేటగిరీ స్థాయికి దిగజారింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇవాళ ఉదయం 370గా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్‌లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







