కిర్రాక్ సీతని కూడా పంపించేశావ్.. ఏం చేద్దామని బిగ్ బాస్.?

- October 14, 2024 , by Maagulf
కిర్రాక్ సీతని కూడా పంపించేశావ్.. ఏం చేద్దామని బిగ్ బాస్.?

సోనియా ఔట్, నైనిక ఔట్.. ఇప్పుడేమో కిర్రాక్ సీత కూడా ఔట్.! ఇంతకీ, ఏం చేద్దామని బిగ్ బాస్.? ఇదీ చర్చ.. సోషల్ మీడియా వేదికగా.! నిన్నటి వీకెండ్ ఎపిసోడ్‌లో హడావిడి ఎక్కువ, విషయం తక్కువ.. అన్నట్టే వుంది. ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయాతి, మంగ్లీ, శ్రీను వైట్ల, గోపీచంద్.. ఇలా సెలబ్రిటీలు సందడి చేశారు.

కానీ, ఏం లాభం.? బిగ్ బాస్ వ్యూయర్‌షిప్ పెద్దగా ఏమీ లేకుండా పోయింది. పండగ స్పెషల్ అంటే, ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్‌లో వుండాలి.? ప్చ్.. చప్పగానే సాగింది. అదే పాత ముతక టాస్కుల వ్యవహారం. అవే పిచ్చి డాన్సులు.. అదే రొట్ట కామెడీ.!

వున్నంతలో విష్ణు ప్రియ కొంచెం కష్టపడింది నవ్వించడానికి, అలరించడడానికి. అంతే, మిగతా అంతా ట్రాష్.! చివర్లో సీత ఎలిమినేసన్.! ఇదేమీ మరీ అంత షాకింగ్ వ్యవహారం కాదు. రొట్ట బ్యాచ్ అంతా హౌస్‌లోనే, కాస్తో కూస్తో విషయం వున్నోళ్ళంతా ఔట్.. అంటూ బిగ్ బాస్ అభిమానులు ఒకింత నిట్టూర్చడం అలవాటైన వ్యవహారంగా మారిపోయింది.

ఇంకా నయ్యం, మెహబూబ్‌ని పంపించెయ్యలేదు.! పంపించేసినా, పంపించేస్తారు.. మునుపటితో పోల్చితే మెహబూబ్ కూడా మరీ ఏమంత యాక్టివ్‌గా కనిపించడంలేదు. అవినాష్, విష్ణు ప్రియ హౌస్‌లో వున్నారంటే, ఎంత ఫన్ వుండాలి.. ప్చ్, అస్సలు సందడి కనిపించడంలేదు.

నిఖిల్, పృధ్వీ.. ప్రతి వారం మరింత డల్ అయిపోతూనే వున్నారు. వైల్డ్ కార్డ్ బ్యాచ్ కొంత బెటర్... అయినా, అదీ సరిపోదు. హౌస్‌లో అందరూ వేస్ట్, ఒక్క విష్ణు ప్రియతోనే సరిపెట్టెయ్యాలన్నట్టుగా, వీకెండ్ ఎపిసోడ్‌లో ఆమె మీదనే ఆధారపడిపోయాడు హోస్ట్ నాగార్జున.

నయన పావని కొంచెం హడావిడి చేయడానికి ప్రయత్నించిందంతే. యష్మి పూర్తిగా డీలాపడిపోయింది. ప్రేరణ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూనే వుంది. మణికంఠ విషయంలో ఏదో జరుగుతోంది.. స్పెషల్ కేటగిరీలో అతనికి అదనపు వెసులుబాట్లు ఏవో కల్పిస్తున్నట్లున్నారు.

గంగవ్వ విషయంలో నిజానికి ఏమీ అనలేం. వున్నంతలో ఆమె చెయ్యాల్సింది చేస్తూనే వుంది. కానీ, ఈ తరహా రియాల్టీ షోలలో ఆమె వుండటం.. ప్చ్, ఎందుకో చాలామందికి నచ్చడంలేదు. కానీ, చాలామంది కంటెస్టెంట్లతో పోల్చితే గంగవ్వ బెటరే మరి.!

దర్శకుడు శ్రీనువైట్ల, హీరో గోపీచంద్‌తో కలిసి వచ్చాడు.. నిజానికి, శ్రీను వైట్లలో బోల్డంత కామెడీ టైమింగ్ వుంటుంది. షో నీరసంగా సాగుతోంటే, శ్రీను వైట్ల మాత్రం ఏం చేయగలడు. జస్ట్ అలా వున్నాడంతే. నిన్నటి ఎపిసోడ్ తాలూకు నీరసం గురించి ఇంతకన్నా ఏం చెప్పగలం.?

ఫరియా అబ్దుల్లా మంచి డాన్సర్.. ఆమె టాలెంట్‌నీ సరిగ్గా వాడుకోలేకపోయారు. డింపుల్ హయాతీ కూడా తేలిపోయింది. అసలంటూ సీతని ఎందుకు పంపేసినట్లు.? ఏదన్నా విషయమ్మీద గట్టిగానే వాయిస్ పెంచుతుంటుంది కదా.? ‘ఎలిమినేట్ అయినందుకు బాధపడుతున్నావా.? అంటే, ఏం లేదు..’ అనేసింది సీత. అంత లైట్ తీసుకుందన్నమాట ఆమె ఈ రియాల్టీ షోని.!

నిజమే, బిగ్ బాస్ హౌస్ కంటే.. ఆమెకు బయట వున్న ఇమేజ్ పెద్దది.! బిగ్ బాస్ వల్ల కిర్రాక్ సీతకి ఒరిగేదేం లేదు. చాలామంది విషయంలో ఇది వాస్తవం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com