గ్రీస్‌లో సౌదీ నేవీ.. జాయింట్ నేవల్-ఎయిర్ ఎక్సర్‌సైజ్‌..!!

- October 14, 2024 , by Maagulf
గ్రీస్‌లో సౌదీ నేవీ.. జాయింట్ నేవల్-ఎయిర్ ఎక్సర్‌సైజ్‌..!!

రియాద్: సౌదీ నేవీ దళాలు గ్రీస్‌లో "మెడుసా 13" పేరుతో నిర్వహిస్తున్న జాయింట్ నేవల్-ఎయిర్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొంటున్నాయి. ఇందులో ఆతిథ్య గ్రీస్ తో పాటు ఈజిప్ట్, ఫ్రాన్స్ , సైప్రస్ పాల్గొంటున్నాయి. సౌదీ నావికాదళ కమాండర్ కమాండర్ కల్నల్ ఫహద్ అల్-ఒతైబీ మాట్లాడుతూ.. నావికాదళ భద్రతను పెంపొందించడానికి ఉమ్మడి భద్రతా సహకారాన్ని నిర్మించడం ఈ ఎక్సర్‌సైజ్‌ లక్ష్యం అని తెలిపారు. సౌతీ నేవీలో ప్రత్యేక నౌకాదళ భద్రతా విభాగాలు, మెరైన్ ఇన్‌ఫాంట్రీ, హిజ్ మెజెస్టి షిప్‌లు,  నేవల్ ఏవియేషన్‌కు చెందిన వివిధ విభాగాలు పాల్గొంటున్నాయి. గ్రీకు ద్వీపం క్రీట్‌-మధ్యధరా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఎక్సర్‌సైజ్‌ జరుగుతుంది. ఇందులో సైనిక కార్యకలాపాలు, సమాచార కార్యకలాపాలు, ఉభయచర దాడి,  పౌరుల తరలింపు వంటివి ఉంటాయని సౌదీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com