బహ్రెయిన్ 6వ లెజిస్టేటివ్ టెర్మ్ 3వ సెషన్ ప్రారంభం..!!
- October 14, 2024
మనామా: బహ్రెయిన్ 6వ లెజిస్టేటివ్ టెర్మ్ 3వ సెషన్ ప్రారంభమైంది. ఈసా కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. కింగ్ కు రాగానే రిప్రజెంటేటివ్స్ కౌన్సిల్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లం, షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థలు, చట్టాల నిర్మాణంలో తమ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.జాతీయ ప్రయోజనాలు గత 25 సంవత్సరాలలో బహ్రెయిన్ పురోగతిని ప్రతిబింబిస్తూ, స్థిరమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ప్రాముఖ్యతను వివరించారు. బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030పై మళ్లీ దృష్టి పెట్టాలని అధికారులను ఆయన కోరారు. 2050 కోసం ముందుకు చూసే దృక్పథం కోసం పిలుపునిచ్చారు. పౌరులందరికీ ప్రయోజనం చేకూర్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







