హవల్లిలో స్పెషల్ తనిఖీలు..కార్లు సీజ్..నోటీసులు జారీ..!!
- October 16, 2024
కువైట్: హవల్లి గవర్నరేట్ మున్సిపాలిటీ అధికారులు స్పెషల్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనలను నమోదు చేశారు. చట్టాలను ఉల్లంఘించిన 395 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో 270 సాధారణ పరిశుభ్రత ఉల్లంఘనలు, 100 రోడ్డు ఆక్రమణ ఉల్లంఘనలు, 15 ఆహార క్వాలిటీ,10 మంది వీధి వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో 61 స్క్రాప్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి ఉల్లంఘనలు, ఆక్రమణలకు పాల్పడినా సహించేది లేదన్నారు. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







