నేడు ఒమాన్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

- October 16, 2024 , by Maagulf
నేడు ఒమాన్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

మస్కట్: ఒమాన్ కంట్రీలోనీ పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు దంచికోడుతున్నాయి. ప్రస్తుతం మస్కట్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తుఫానులు కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు సూర్ నుండి కురియాత్ వరకు ఉన్న తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. నేడు మస్కట్ గవర్నరేట్ నుండి దక్షిణ అల్ బతీనా వరకు ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. సోమవారం నుండి దక్షిణ అల్ షార్కియాహ్ గవర్నరేట్ మరియు అల్ వుస్తా గవర్నరేట్‌లపై వర్షపు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ వర్షాలు కొద్దిగా, కొన్నిసార్లు భారీగా కురుస్తున్నాయి. మంగళవారం ఈ వాతావరణ పరిస్థితి ఉత్తర గవర్నరేట్లలోని కొన్ని ప్రాంతాలను కూడా ప్రభావితం చేసింది. సోమ మంగళవారాల్లో కొన్ని ప్రాంతాల్లో సుమారు 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


ఈ వర్షాల కారణంగా అల జబల్ స్ట్రీట్ (అమెరత్ - బౌషర్ రోడ్) లో ట్రాఫిక్ మూసివేయబడింది. వాడి బని ఖలీద్ పర్వత రోడ్ ముందు జాగ్రత్తగా మూసివేయబడింది. ఉత్తర మరియు దక్షిణ అల్ షార్కియాహ్ గవర్నరేట్లలో వాడీలు ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (MTCIT) అన్ని నౌక యజమానులు, షిప్పింగ్ కంపెనీలను సముద్రంలోకి వెళ్లకుండా మరియు సముద్ర కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలని కోరింది. 

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com