‘ఓజీ’ అప్డేట్.! మ్యాడ్ నెస్ క్రియేట్స్.!
- October 16, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా ఆల్రెడీ కొంత మేర షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోవడం వల్ల తాత్కాలికంగా సినిమా షూటింగ్ నిలిపివేయడం జరిగింది.
కానీ, ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వార్తల్లో నిలుస్తూనే వుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తూ వెంటాడుతూనే వుంది. ఇక, ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది కూడా. లేటెస్ట్గా చిత్ర యూనిట్ నుంచి అప్డేట్ వచ్చింది. షూట్ బిగిన్స్ అంటూ. సినిమాటోగ్రఫర్ రవి.కె.చంద్రన్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు.
‘అన్ని సిలిండర్లు ఫైర్ చేసి, మ్యాడ్నెస్ సృష్టించేందుకు మేం మళ్లీ ‘ఓజీ’ ఫీవర్‌లోకి అడుగు పెట్టేశాం..’ అని ట్వీట్ చేశారాయన. అంతేకాదు, ఓ ఫోటో కూడా షేర్ చేశారాయన.
అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్లో వున్న కారణంగా ‘ఓజీ’ ఆయన లేకుండానే స్టార్ట్ అయ్యింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా షూట్లో జాయిన్ కానున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







