‘అఖండ - తాండవమే’.! బాలయ్య

- October 16, 2024 , by Maagulf
‘అఖండ - తాండవమే’.! బాలయ్య

బోయపాటి శీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే తాండవం. రుద్ర తాండవం. అలాంటి తాండవంలాంటి ‘అఖండ’ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతోంది.

తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చేశారు. ‘అఖండ 2’ సినిమాకి  ‘తాండవం’ అనే క్యాప్షన్ ఇచ్చారు. మొదటి పార్ట్‌లోనే బాలకృష్ణ రుద్ర తాండవమాడేశారు.

ఇక, రెండో పార్ట్‌కి క్యాప్షనే ‘తాండవం’ అని పెట్టారు. అంటే ఈ సినిమాలో యాక్షన్, మాస్ ఏ రేంజ్‌లో వుండబోతున్నాయో అని అభిమానులు ఓ అంచనాకి వచ్చేశారు.

ఈ సినిమాలోనూ  ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించనుంది. అలాగే మరో కొత్త భామకీ ఛాన్స్ వుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ప్రస్తుతం బాలయ్య - బాబీ కాంబినేషన్ మూవీ నిర్మాణంలో వున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. బాలయ్యకు బాగా కలిసొచ్చే సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమాకి స్లాట్ బుక్ చేసేందుకు మేకర్లు రంగం సిద్ధం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com