దుబాయ్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల కొరతకు చెక్..రెండు కంపెనీలకు లైసెన్స్..!!
- October 17, 2024
యూఏఈ: దుబాయ్‌లోని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం మొదటి రెండు ఇండిపెండెంట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ (CPO) లైసెన్స్‌లను టెస్లా, UAEVలకు జారీ చేశారు. GITEX గ్లోబల్ 2024 సందర్భంగా దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా) ఈ మేరకు ప్రకటించింది. EV ఛార్జింగ్ స్టేషన్లను నిర్వహించడానికి లైసెన్స్‌ల మంజూరు దుబాయ్‌లో V ఛార్జింగ్ స్టేషన్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరిస్తుందని దేవా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ తాయర్ అన్నారు. "ఇది దుబాయ్‌లో గ్రీన్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. మెరుగైన జీవన నాణ్యతకు దోహదం చేస్తుంది. స్వచ్ఛమైన శక్తిని వినూత్నంగా ఉపయోగించడం, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాం." అని ఆయన చెప్పారు. దేవా 2014లో రీజియన్‌లో మొట్టమొదటి పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







