ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్ మాల్ .. మూడు కంపెనీలకు ఈడీ నోటీసులు
- October 17, 2024
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది. \ఈ నెల 8న అజారుద్దీన్ను విచారించిన విషయం తెలిసిందే.అజార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని కంపెనీలకు ఆదేశించింది.
జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలసిందే.అజారుద్దీన్ 2020 నుంచి 2023 వరకు హెచ్ సీ ఏలో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ చేశారని ఫారెన్సిక్ నివేదిక వెల్లడించింది.
ఆగస్ట్ 10వ తేదీన హెచ్ సీ ఏ నిధులపై సుప్రీం కోర్ట మాజీ న్యాయవాది జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. ఇందులో క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దీంతో ఉప్పల్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడంతో అజారుద్దీన్ పై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







