ప్రదీప్ మాచిరాజు ఇంకోస్సారి.! కుంభస్థలాన్నే కొట్టాలని.!
- October 17, 2024
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా తన కోరిక తీర్చుకున్నాడు బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు. బుల్లితెరపై తిరుగులేని మేల్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ప్రదీప్.. హీరోగానూ వెండితెరపై తనదైన ముద్ర వేయాలనుకున్నాడు.
అలా వచ్చిందే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటతో సంచలనాలు సృష్టించాడు కానీ, సినిమా ఆశించిన విజయం అయితే అందుకోలేకపోయింది.
ఇక, ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని ఇంకో సినిమాతో రాబోతున్నాడు. అదే ‘అక్కడ అమ్మాయ్ ఇక్కడ అబ్బాయ్’. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా టైటిల్‌నే తన సినిమాకి పెట్టేసుకున్నాడు ప్రదీప్ మాచిరాజు.
ఈ సినిమాలో నటిస్తున్న ఆ ‘అక్కడ అమ్మాయ్’ ఎవరో కాదు, ఆమె కూడా బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియా వ్యూయర్స్‌కీ సుపరిచితురాలే. దీపిక పిల్లి.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మరియు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలాగే బుల్లితెర యాంకర్ అయిన దీపిక పిల్లికి హీరోయిన్‌గా ఇదే తొలి ఛాన్స్. ఈ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
మోషన్ పోస్టర్ ఆసక్తిగా అనిపిస్తోంది. బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ నిర్వాహకులైన నితిన్ అండ్ భరత్ ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే డైరెక్షన్ అందిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







