డిజిటల్ సహకారం.. ఇండియాతో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- October 17, 2024
రియాద్: సౌదీ అరేబియా-ఇండియా మధ్య డిజిటల్ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇందులో భాగంగా భారతదేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI)తో సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటీ, కమిషన్ గవర్నర్ డాక్టర్ మహమ్మద్ అల్తమీమి సంతకాలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్‌ఏ) సందర్భంగా ఎంఓయూపై సంతకాలు చేశారు. భారతదేశ సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెగ్యులేటరీ టెక్నాలజీ (రెగ్‌టెక్) అప్లికేషన్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు డిజిటల్ రెగ్యులేషన్ పై ఉమ్మడిగా రీసెర్చ్ చేయనున్నారు. అలాగే డిజిటల్ రెగ్యులేషన్స్ అకాడమీ (DRA) అందించే శిక్షణా కార్యక్రమాల నుండి సౌదీ ప్రయోజనం పొందనుంది. వీటితోపాటు కమ్యూనికేషన్స్, స్పేస్, టెక్నాలజీలో సహకారాన్ని అందించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







