నవంబర్‌లో బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బ్యాక్.. పుస్తకాలపై 75% వరకు తగ్గింపు..!!

- October 18, 2024 , by Maagulf
నవంబర్‌లో బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బ్యాక్.. పుస్తకాలపై 75% వరకు తగ్గింపు..!!

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శన బిగ్ బ్యాడ్ వోల్ఫ్ ఆరవ ఎడిషన్ నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు దుబాయ్ స్టూడియో సిటీలోని సౌండ్ స్టేజ్‌లలో నిర్వహించబడుతుంది.  ప్రవేశం ఉచితం. విస్తృత శ్రేణి పుస్తకాలపై 75 శాతం వరకు తగ్గింపుతో రానుంది.  దుబాయ్ స్టూడియో సిటీలోని సౌండ్ స్టేజ్‌లలో  బెస్ట్ సెల్లర్‌లు, జీవిత చరిత్రలు, గ్రాఫిక్ నవలలు, పిల్లల పుస్తకాలు, క్లాసిక్‌లు, సైన్స్ ఫిక్షన్, కళలు, చేతిపనులు, చరిత్ర, వ్యాపార పుస్తకాలు, అనేక అరబిక్ పుస్తకాలు, వంటల పుస్తకాలతో సహా రెండు మిలియన్లకు పైగా పుస్తకాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 2009లో ప్రారంభమైనప్పటి నుండి బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్స్ ఫిలిప్పీన్స్, కంబోడియా, హాంకాంగ్, ఇండోనేషియా, మయన్మార్, పాకిస్తాన్, సింగపూర్, తైవాన్, యూఏఈ,  మలేషియా, శ్రీలంక, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ సహా 15 దేశాలలో 37 నగరాలలో ప్రదర్శనలు నిర్వహించినట్టు బిగ్ బాడ్ వోల్ఫ్ వ్యవస్థాపకుడు ఆండ్రూ యాప్ తెలిపారు. షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలోని దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ (దుబాయ్ కల్చర్) ఈ ఈవెంట్‌కు మద్దతు ఇస్తుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com