ఆశకు పోయి ఆసుపత్రి పాలైన రకుల్ ప్రీత్ సింగ్.!
- October 18, 2024
ఆశకు మించిన బరువులెత్తి అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఆసుపత్రి పాలైంది. వివరాల్లోకి వెళితే, రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఫ్రీక్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అనేక ఫిట్నెస్ స్టూడియోస్ నడిపిస్తూ తనదైన శైలిలో ఓ వైపు బిజినెస్ చేస్తూనే.. మరోవైపు స్లిమ్ అండ్ స్లీకీ బాడీని మెయింటైన్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
అయితే, తాజాగా మోయలేని బరువులెత్తి అనవసరంగా ఆసుపత్రి పాలైంది. ‘మనసు చెప్పింది. నేను మోసేయగలను.. అని మోసేశాను.. కానీ సీన్ రివర్స్ అయ్యింది..’ అని తనకు జరిగిన ప్రమాదం గురించి తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
అయితే, రకుల్‌కి ఇదేం కొత్త కాదు. గతంలో ఫిట్‌నెస్‌లో భాగంగా చాలాసార్లే బరువులు ఎత్తింది. అయితే, టైమ్ అన్నిసార్లూ ఒకేలా వుండదు. కొన్ని సార్లు టైమ్ బ్యాడ్ అయితే ఇదిగో ఇలాగే రివర్స్ అవుతుంటుంది.
ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజనం కోరుకుంటూ ట్వీట్స్ వేస్తున్నారు. ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోయిన్. ఇప్పుడు మాత్రం బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.
విలక్షణ పాత్రలు చేస్తూ, తనదైన ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది అక్కడ. రకుల్ త్వరగా కోలుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!







