13 నివాస ప్రాంతాలలో వాటర్ డ్యామ్స్.. కొత్త ప్రాజెక్ట్‌ను యూఏఈ ఆమోదం..!!

- October 19, 2024 , by Maagulf
13 నివాస ప్రాంతాలలో వాటర్ డ్యామ్స్.. కొత్త ప్రాజెక్ట్‌ను యూఏఈ ఆమోదం..!!

యూఏఈ: యూఏఈలో డజనుకు పైగా వాటర్ డ్యామ్స్, నీటి కాలువలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులకు యూఏఈ ఆమోదం తెలిపింది.  'యూఏఈ ప్రెసిడెంట్ చొరవ' కిందకు వచ్చే ఈ మెగా ప్లాన్.. వర్షపు నీటి సేకరణను పెంచడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని 8 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. వరదలను నివారించడం, కొన్ని నివాస ప్రాంతాలపై భారీ వర్షాల ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.  వివిధ ప్రాంతాలలో తొమ్మిది డ్యామ్‌లు,  తొమ్మిది నీటి కాలువలు 9 కిలోమీటర్ల మేర నిర్మించబడతాయని ప్రభుత్వం తన నివేదికలో తెలిపింది.ఇప్పటికే ఉన్న రెండు డ్యామ్‌ల విస్తరణను కూడా ప్లాన్ కవర్ చేస్తుందని పేర్కొన్నారు. 

ప్రాజెక్ట్ 13 నివాస ప్రాంతాలలో 19 నెలల్లో అమలు చేయనున్నారు. ఇవి:

షార్జా షిస్ ప్రాంతం, ఖోర్ఫక్కన్ సిటీ 

అజ్మాన్ మాస్ఫౌట్ ప్రాంతం

రాస్ అల్ ఖైమా షామ్, అల్ ఫహలిన్

ఫుజైరా మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ, అల్ హైల్, అల్ ఖరియా, కిద్ఫా, మార్బా, ధడ్నా, అల్ సీజీ, అల్ ఘజిమ్రి

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో యూఏఈ..75 సంవత్సరాలలో చూడని అత్యంత భారీ వర్షపాతాన్ని చవిచూసింది. అనేక విమానాలు నిలిచిపోయాయి. ఇళ్లు, రహదారులను వరదలు ముంచెత్తాయి. కార్లు నీటిలో మునిగిపోయాయి.ఈ నేపథ్యంలో  ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ దేశంలోని మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com