ఎఆర్ రెహమాన్. మరో మ్యాజికల్ ఆల్బమ్‌...

- June 22, 2016 , by Maagulf
ఎఆర్ రెహమాన్.  మరో మ్యాజికల్ ఆల్బమ్‌...

ఇటీవల విడుదలైన 'సాహసం శ్వాసగా సాగిపో' పాటలతో సంగీత ప్రియులను మెప్పించారు ఎఆర్ రెహమాన్. అంతలోనే మరో మ్యాజికల్ ఆల్బమ్‌ అందించిందేకు సిద్ధమైపోయారీ స్వర మాంత్రికుడు. కార్తి హీరోగా మణిరత్నం ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. పైలట్ పాత్రలో కార్తి కనపడనున్న ఈ సినిమాలో అతడికి జతగా అదితి రావు హైదరీ నటించనుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకి రెహమాన్ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సంగీత చర్చలు ఇటీవల మొదలయ్యాయి. ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు ఈ సినిమాకి గీత రచన చేయనున్నారు. ప్రస్తుతం 'కాష్మోరా' సినిమాతో బిజీగా ఉన్న కార్తీ అది పూర్తయిన వెంటనే మణితర్నం సినిమా కోసం లవర్ బాయ్‌గా మారనున్నాడు.
ఈ సినిమాని సొంత బ్యానర్‌ మద్రాస్ టాకీస్‌లో మణిరత్నం నిర్మించనున్నారట. అన్నట్టు నటుడిగా తెరమీదికి రాకముందు కార్తి మణితర్నం వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com