ట్రాఫిక్ కష్టాలకు చెక్.. E311 నుండి అల్ వర్కాకు కొత్త యాక్సెస్ పాయింట్లు..!!

- October 20, 2024 , by Maagulf
ట్రాఫిక్ కష్టాలకు చెక్.. E311 నుండి అల్ వర్కాకు కొత్త యాక్సెస్ పాయింట్లు..!!

దుబాయ్: దుబాయ్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు. కొత్త ప్రాజెక్ట్ తో అల్ వర్కా ప్రాంతానికి నేరుగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుండి అదనపు ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు అందుబాటులోకి వస్తాయని  రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదేవిధంగా 20 నిమిషాలు పట్టే ప్రయాణ సమయం 3.5 నిమిషాలకు(80శాతం) తగ్గుతుందని,   ప్రయాణ దూరం5.7 కి.మీ నుండి 1.5 కి.మీ వరకు తగ్గుతుందని ప్రకటించారు. ఒక సంవత్సరం లోపు పూర్తవుతుందని అంచనా వేయబడిన ఈ ప్రాజెక్ట్ రహదారి సామర్థ్యాన్ని గంటకు 5,000 వాహనాలు పెంచుతుంది. ట్రాఫిక్ సులువుగా సాగేందుకు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్గత రహదారి నెట్‌వర్క్‌లో అనేక అప్డేట్ లను కూడా ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అధునాతన స్పెసిఫికేషన్‌లతో ఇప్పటికే ఉన్న రౌండ్‌అబౌట్‌లను సిగ్నలైజ్డ్ జంక్షన్‌లుగా మార్చడంతోపాటు అల్ వర్కా 1 స్ట్రీట్‌లో అదనపు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు అల్ వర్కా 1 స్ట్రీట్ సామర్థ్యాన్ని 30 శాతం పెంచుతాయని భావిస్తున్నారు.  ప్రస్తుతం అల్ వర్కా 3, అల్ వర్కా 4 లలో అంతర్గత రోడ్లను  ఆర్టీఏ నిర్మిస్తోంది. అలాగే 16 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ కూడా నిర్మాణంలో ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com