వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసిన మెకానికల్ ఇంజినీర్
- October 20, 2024
బెంగళూరు: "కాదేది కవితకు అనర్హం" అంటూ మన ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ రాసిన "మహాప్రస్థానం" లోని ఈ వాక్యం కవిత్వానికి అనర్హమైనది ఏదీ లేదు అని సూచిస్తుంది. అలాగే “పట్టుదల ఉంటే కూడా ఏదైనా సాధించొచ్చు” అని నిరూపించాడు బెంగళూరుకు చెందిన ఓ మెకానికల్ ఇంజినీర్. ప్రొడక్ట్ డిజైనర్ అయిన దీపక్ దధీచ్ తాజాగా ఇతను వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్ మరియు ప్రొడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్ వెదురు బొంగుతో డ్రోన్ తయారు చేశారు. దీపక్ తన ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, పర్యావరణ హితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ను రూపొందించారు. ఈ డ్రోన్ తయారీలో ప్రధానంగా వెదురు బొంగును ఉపయోగించి తక్కువ బరువుతో కూడిన బలమైన నిర్మాణంతో డ్రోన్ ని తయారు చేశాడు.
ఈ డ్రోన్ను ముఖ్యంగా వ్యవసాయం, పర్యావరణ పరిశీలన మరియు చిన్న సరుకుల రవాణా వంటి రంగాల్లో వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారు. తన సృజనాత్మకతను మరియు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, ఒక వినూత్నమైన పరికరాన్ని తయారు చేసిన దీపక్ ను తన సహచరులు ఎంతగానో అభినందించారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







