అక్టోబర్ 22న మంగళగిరిలో అతి పెద్ద డ్రోన్ షో
- October 20, 2024
అమరావతి: ఈనెల 22న దేశంలో ఎక్కడా జరగని విధంగా 5 వేల డ్రోన్లతో ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో జరగబోయే ఈ ఈవెంట్ ఇండియా డ్రోన్ సమ్మేళనంలో ఒక అద్భుతమైన ప్రదర్శనగా నిలవబోతోంది.ఈ సమ్మేళనంలో సుమారు 5800 డ్రోన్లు పాల్గొనబోతున్నాయి. ఈ ప్రదర్శనలో 1500 కంపెనీలు పాల్గొంటుడంతో ఇది ఒక భారీ ఎగ్జిబిషన్‌గా ఉండబోతోంది. ఇది ఇండియాలోనే మొదటిసారి ఇక్కడ ఏర్పాటు అవుతోంది.
ఈ డ్రోన్ సమ్మేళనం రెండు రోజుల పాటు జరగనుంది. వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తు ఉత్పత్తి రంగాల్లో డ్రోన్ల వినియోగంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనుంది. వాణిజ్య పరంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌కు ఈ సమ్మిట్‌లో రూపకల్పన చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి పుల్నమ్ హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, డ్రోన్ తయారీ నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్‌కు వచ్చే వారు ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’ వెబ్‌సైట్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈ భారీ డ్రోన్ షోను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చు. అత్యాధునిక సేవలందించే డ్రోన్లు తయారు చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక