ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
- October 20, 2024
బెంగళూరు: బెంగళూరులో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాను న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ ప్రారంభంలోనే భారత బ్యాటర్లు తేలిపోవడంతో, తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలిపోయారు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించి, భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా మాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా, ఓ రూర్క్ 4 వికెట్లు తీశాడు.
తదుపరి, న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులు చేసి, 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 134 పరుగులతో మెరిశాడు.
భారత రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేసి, పంత్ 99 పరుగులతో రాణించారు. కానీ, 462 పరుగులు చేసినా, న్యూజిలాండ్ ముందు 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు. న్యూజిలాండ్ ఈ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ యంగ్ 48 పరుగులు, రచిన్ రవీంద్ర 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు అక్టోబర్ 24న పుణె వేదికగా జరగనుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక