ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- October 20, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమవుతుందనీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలుపుతామని ప్రకటించిన ఆయన ఈ పథకం కింద, ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, పారదర్శక పాలన అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో చేశారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఆయన వివరించారు. ఈ పథకం వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







