24వ TANA మహాసభలు...ఫండ్ రైజింగ్ ఈవెంట్ సక్సెస్...
- October 20, 2024
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) డెట్రాయిట్లో 2025 జులై 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 24వ తానా ద్వైవార్షిక మహాసభల నిధుల సేకరణ, సన్నాహక సమావేశంలో భాగంగా డెట్రాయిట్ లోని సెంట్ తోమా చర్చ్ లో అక్టోబర్ 19వ తేదీన నిర్వహించిన కిక్ ఆఫ్, ఫండ్ రైజింగ్ ఈవెంట్ విజయవంతమైంది.ఈ సందర్భంగా డోనర్ల నుంచి 3 మిలియన్ డాలర్ల మేరకు నిధుల హామి లభించింది.
24వ తానా మహాసభల కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు, కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ చాపలమడుగు మాట్లాడుతూ, ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలతోపాటు, మన సంప్రదాయాన్ని తెలియజేసేలా కార్యక్రమాల రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభల వెన్యూ అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో డెట్రాయిట్ సబర్బన్ నోవీలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ ను ఎంపిక చేసినట్లు వివరించారు. గతంలో వివిధ మహాసభలను నిర్వహించిన అనుభవంతో ఈ మహాసభలను కూడా తాము విజయవంతంగా నిర్వహిస్తామని ఉదయ్ కుమార్ చాపలమడుగు, గంగాధర్ నాదెళ్ళ తెలిపారు.డెట్రాయిట్ సబర్బన్‌లోని నోవైలో ఉన్న తెలుగు కమ్యూనిటీ, డిటిఎ నాయకులు ఇందులో భాగస్వాములవుతున్నారని అందరి సహకారంతో ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కు వివిధ ప్రాంతాల్లో ఉన్న తానా నాయకులంతా హాజరై తమవంతు తోడ్పాటును అందించేందుకు హామి ఇచ్చారు. తమవంతుగా పలువురు ఈ కార్యక్రమంలో విరాళాలను ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగుతోపాటు కాన్ఫరెన్స్ ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, కో కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ కోనేరు, డైరెక్టర్ సునీల్ పాంట్ర, సెక్రటరీ కిరణ్ దుగ్గిరాల, ట్రెజరర్ జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా నార్త్ రీజినల్ రిప్రజెంటేటివ్ నీలిమ మన్నెతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రెసిడెంట్ ఎలక్ట్ నరేన్ కొడాలి, కార్యదర్శి రాజా కసుకుర్తి, ట్రెజరర్ భరత్ మద్దినేనితోపాటు ఇతర సభ్యులు,బోర్డ్ నుంచి చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, సెక్రటరీ లక్ష్మీ దేవినేని, ట్రెజరర్ జనార్ధన్ నిమ్మలపూడి, రవి పొట్లూరి, లావు శ్రీనివాస్ తదితర బోర్డ్ డైరెక్టర్లు, ఫౌండేషన్ నుంచి ట్రెజరర్ వినయ్ మద్దినేనితోపాటు ఇతర సభ్యులు, అలాగే వివిధ చోట్ల ఉన్న తానా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
డెట్రాయిట్ నుంచి తానాకు సేవలందించిన 30 మంది సభ్యులను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి 500 మందికి పైగా హాజరయ్యారు.ఇటీవలే మరణించిన తానా నాయకులు చలసాని మల్లిఖార్జున రావు, కొడాలి చక్రధర్ రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి సేవలను కొనియాడారు.


తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







