క్షమాభిక్ష కాలవ్యవధికి స్పందించని వలస కార్మికులు
- July 07, 2015
ఒమాన్ లో అక్రమ వలస కార్మికుల కోసం ఇవ్వబడిన 3 నెలల క్షమాభిక్ష కాల వ్యవధి ఈనెల 31న ముగియనున్న నేపధ్యంలో, ఆశించినదానిలో కనీసం 5 వ వంతు కన్నా తక్కువమంది స్పందించడం, నిరాశాజనకం. ఈ దేశంలో 50,000 మంది అనధికారికంగా లేదా కాంట్రాక్టు వ్యవధి దాటిన కార్మికులున్నప్పటికీ, కేవలం 8000 మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒమాన్‌లో ఉన్న నాలుగు ముఖ్య ఏషియా దేశాల రాయబార కార్యాలయ లెక్కల ప్రకారం, 8334 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిసింది. మొత్తం మీద 4000 మంది దేశాన్ని వదిలి వెళ్లారనీ, 12000 మంది రిజిస్టర్ చేయించుకున్నారని తెలియ వచ్చింది. ఈవిధమైన క్షమాభిక్ష వ్యవధి కార్యక్రమాన్ని ప్రభుత్వం గతంలో 2005 నుండి 2010 వరకు కూడా చేపట్టిందని, అప్పట్లో సుమారు 60,000 మంది వలస కార్మికులు, ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుండి తమ స్వదేశాలకు వెళ్లారని అధికారులు తెల్పారు. ఈసారి ఇప్పటివరకు 1700 మంది భారతీయులు, 2500 మంది పాకిస్తానీయులు, 134 మంది ఫిలిపేన్స్ వారు ఈ అవకాశాన్ని వినియొఈగించుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







