నక్క - కోడిపుంజు
- July 06, 2015
అనగనగా ఒక రైతు తన ఇంట్లో చాలా కోళ్లను పెంచుతూ ఉండేవాడు. వాటికి ఒక మెష్ని తయారుచేసి అందులో ఉంచేవాడు. అయితే వాటి మెష్ వెలుపల నక్క ఒకటి ఎప్పటినుంచో మాటు వేసి వాటిని తినేద్దామని ఎదురుచూస్తూ ఉంది. కానీ ఆ మెష్ దాటి ఆ కోడిపుంజులు ఎప్పుడూ బయటికి వచ్చేవి కావు. ఒకరోజు రైతు పనిమీద ఊరికి కొంచెం దూరంగా ఉన్న పొలంలోకి వెళ్లాడు. అది గమనించిన నక్క కోళ్ల దగ్గరికి వచ్చి మీ రైతు వచ్చేవరకూ మిమ్మల్ని నన్నే చూసుకోమన్నాడు కాబట్టి మీరు నాతో చక్కగా బోలెడన్ని ఆటలు ఆడుకోవచ్చు. మీకు నేను కొత్త కొత్త ఆటలు నేర్పిస్తాను అని ఆ కోళ్లను బయటికి రప్పించాలని ప్రయత్నించింది. కానీ ఆ కోళ్లు దాని మాట పట్టించుకోలేదు. మరునాడు ఉదయాన్నే వచ్చి మీకు తిండి పెట్టడానికి మీ రైతు నన్ను బయటికి తీసుకెళ్లమన్నాడు అని మరొక ప్రయత్నం చేయదలచింది. కానీ ఫలించలేదు. ఇక రోజూ ఇలా నక్క ఏదోఒక రకంగా ఎత్తు మీద ఎత్తు వేసి వాటిని తినాలనీ ప్రయత్నిస్తూనే ఉంది. దాని ప్రయత్నాలను తిప్పి కొడుతూనే ఉన్నాయి కోళ్లు. అయితే ఒకరోజు ఆ కోళ్లలోని ఒక కోడిపుంజు ఎలాగైనా ఈ నక్క బారి నుండి తప్పించుకోవాలని ఆలోచించి ఒకరోజు నక్కతో 'ఓ నక్కబావా! ఇటు రా.. మా కోళ్లలో ఏ ఒక్కరూ నీతో స్నేహం చెయ్యడానికి ఇష్టపడట్లేదు. నేను మాత్రమే అందుకు అంగీకరిస్తున్నాను. అయితే ఒక్క షరతు. నీతో స్నేహం చెయ్యాలంటే నేను చెప్పినచోటకి నాతో పాటు రావాలి అక్కడ మనం ఇద్దరమే చక్కగా ఆడుకోవచ్చు అని చెప్పింది.' అందుకు ఆ నక్క భలే భలే ఈ కోడిపుంజు మాంసం భలే రుచిగా ఉంటుంది. హమ్మయ్య నా కోరిక తీరుతుంది అని దాని వెంట వెళ్లసాగింది. అలా వెళ్లగా ఆ కోడిపుంజు తన రైతు పని చేసే పొలం వైపుకు తీసుకెళ్లి అక్కడ కొక్కొరొకో అని అరవడం మొదలుపెట్టింది. దాంతో పొలంలో పని చేస్తున్న రైతు మిగతా రైతుల్ని కూడా తీసుకుని వచ్చి ఆ నక్కని చూసి అటకాయించి కర్రలతో చితకబాదాడు. చావుదెబ్బలు తిన్న నక్క భయంతో బతుకు జీవుడా అనుకుని అక్కడి నుండి దూరంగా అడవిలోకి పరుగు లంఘించుకుంది. అప్పటి నుండి కోళ్లకు ఆ నక్క బాధ తప్పింది. కోడిపుంజు తెలివితేటలకు రైతు, మిగతా కోళ్లు మెచ్చుకుని ఎంతో సంతోషించాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







