సౌదీ అరేబియాలో రైల్వే చట్టం బలోపేతం..ఇక SR10 మిలియన్ల వరకు జరిమానా..!!
- October 21, 2024
జెడ్డా: సౌదీ అరేబియాలో రైల్వే చట్టాలను బలోపేతం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా SR10 మిలియన్ల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. బడుతుంది. ఉల్లంఘన పునరావృతమైతే SR20 మిలియన్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.ఈ మేరకు రైల్వే చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనల ఉల్లంఘనలను సమీక్షించే కమిటీ ప్రకటించింది.రైల్వేల కార్యక్రమాలను అడ్డుకునేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ప్రాంగణాల్లో వాహనాలు, సామగ్రిని వదిలేయడం, జంతువులను వదిలివేయడం, రైల్వే రక్షణ కంచెలను దాటడం, తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాలను నిర్మించడం వంటి అనేక ఉల్లంఘనలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయని వెల్లడించింది. రైల్వే ట్రాక్, ప్రాంగణాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







