నైట్‌క్లబ్ హిట్-అండ్-రన్ కేసు..ఇద్దరు గల్ఫ్ జాతీయులు అరెస్ట్..!!
- October 21, 2024
మనామా: అల్ హూరా ప్రాంతంలోని నైట్‌క్లబ్ వద్ద జరిగిన హిట్ అండ్ రన్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి 24 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు గల్ఫ్ జాతీయులను నిందితులుగా గుర్తించారు. ఆగస్టు 2న నిందితులు ఉద్దేశపూర్వకంగా నైట్ క్లబ్ సెక్యూరిటీ గార్డును చంపి, మరో ఇద్దరిని గాయపరిచారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
నైట్‌క్లబ్ మేనేజర్ వాంగ్మూలం ప్రకారం.. ఈ సంఘటన ఆగస్టు 1వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. ఇద్దరు నిందితులు మత్తులో హోటల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నైట్‌క్లబ్‌లోకి మద్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణ పడ్డారు. అనంతరం తెల్లవారుజామున 1 గంటలకు తమ వాహనంతో నైట్‌క్లబ్ వెలుపల నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డులను ఢీకొట్టారు.ఇందులో ఒక గార్డు మరణించగా.. ఇద్దరు గార్డులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తర్వాత నిందితులు కింగ్ ఫహద్ కాజ్‌వే మీదుగా బహ్రెయిన్‌ను విడిచి పారిపోయారు. ఈ సంఘటన జరిగిన 19 రోజుల తర్వాత నిందితులు తిరిగి రాజ్యానికి వచ్చారు. వారి కదలికలను ట్రాక్ చేస్తున్న పోలీసులు.. కింగ్ ఫహద్ కాజ్‌వే వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. నిందితులపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలను నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







