ఏపీకి మరో తుపాను ముప్పు.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు
- October 21, 2024
ఏపీకి మరో తుపాను ముప్పు ముంచుకొస్తుంది. ఉత్తర అండమాన్ కు ఆనుకొని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ రేపు ఉదయం వాయుగుండంగా బలపడనుంది. ఈనెల 23వ తేదీ నాటికి వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. ఈ తుపానుకు ‘దానా’ అని నామకరణం చేశారు. ఈ తుపాను ఈనెల 24 నాటికి ఒరిశా – బెంగాల్ తీరాలకు చేరుకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కారణంగా ఏపీలో ఈనెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తీరం వెంబడి గంటకు 45 – 46 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సముద్రంలోకి వేటకు వెళ్లినవారు తిరిగిరావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు అనకాపల్లి, విశాఖపట్టణంతోపాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతినగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం మిగిల్చిన నష్టం నుంచి ఇంకా కోలుకోక ముందే ఏపీకి మరో తుపాను ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ పేర్కొడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







